ప్రత్యేకమైన హై-ఫ్లో మ్యాక్స్ * టెక్నాలజీతో వేగవంతమైన వాటర్-ట్యాంక్ ఫిల్లింగ్‌ను అందించే క్రాంప్టన్ ఉత్పాదన మినీ మాస్టర్ ప్లస్ పంప్

Reading Time: < 1 minute

మే 2023: నాణ్యత, విశ్వసనీయత, ఆవిష్కరణలతో విశ్వసనీయమైన వారసత్వాన్ని కలిగిన బ్రాండ్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ప్రత్యేకమైన హై-ఫ్లో మ్యాక్స్* టెక్నాలజీతో కూడిన మినీ మాస్టర్ ప్లస్ పంప్‌ను ప్రారంభించింది. తాజా ఉత్పాదన అనేక వినూత్న ఫీచర్లతో వస్తుంది. నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది, తద్వారా సగం సమయంలో వేగంగా వాటర్ ట్యాంక్ నింపేలా చేస్తుంది.

నేడు, వినియోగదారులు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో మరింత స మాచారం, అవగాహనతో ఉంటున్నారు. భారతీయ కుటుంబాలలో, ప్రత్యేకించి ఉమ్మడి కుటుంబాలలో నివ సించేవారు లేదా బహుళ అంతస్తుల బంగ్లాలలో నివసించేవారు, ట్యాంక్ నింపడంలో చాలా అసౌకర్యాలకు గురవుతుంటారు. అందుకు గణనీయమైన సమయం పడుతుంది. పంపులు వేగంగా నీటి ప్రవాహాన్ని సర ఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి, వేగంగా ట్యాంక్ నిండేలా చేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, క్రాం ప్టన్ తన ఉత్పాదన మినీ మాస్టర్ ప్లస్ పంప్‌తో వేగంగా ట్యాంక్ నింపడాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. సాంకేతికంగా ఉన్నతమైన పంపుల విస్తృత ఉత్పత్తి శ్రేణి వినియోగదారులకు తక్కువ నిర్వహణ ఖర్చులు, అధిక మన్నిక, పనితీరు, డబ్బుకు విలువ, తక్కువ శక్తి వినియోగం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

క్రాంప్టన్ మినీ మాస్టర్ ప్లస్ పంప్ వాల్యూట్ కేసింగ్, అడాప్టర్ వంటి కీలకమైన భాగాలపై స్టెయిన్‌లెస్-స్టీల్ షీట్ (SS)తో సహా అధునాతన ఫీచర్‌లను కలిగి ఉంది, ఇది తుప్పు పట్టకుండా చేస్తుంది. అవాంతరాలు లేని ఆపరేషన్‌ను అందిస్తుంది. ఇది జామింగ్ లేదా పంప్ వైఫల్యం వంటి సమస్యలను నిర్ధారిస్తుంది, తద్వారా నీటి సాఫీగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా, దీని నిర్మాణం పంపుల హైడ్రాలిక్స్‌ ను ప్రభావితం చేస్తుంది, తద్వారా అధిక నీటి ఉత్పత్తిని, మెరుగైన పనితీరును అందిస్తుంది. వేగంగా* ట్యాంక్ నింపడంలో, తిరుగు లేని వినియోగదారు అనుభవాన్ని సృష్టించడంలో సహాయపడే 4 ముఖ్య లక్షణాలు:

పెద్ద ఇంపెల్లర్ పరిమాణం: నీటి సరఫరా 120% నుండి 200% పెరుగుతుంది, 35%-50% పెద్ద ఇంపెల్లర్ పరిమాణం కారణంగా ట్యాంక్ నింపే సమయం 50% నుండి 60% వరకు తగ్గుతుంది.

శక్తివంతమైన మోటార్: పెద్ద స్టాంపింగ్, సమర్థవంతమైన డిజైన్‌తో కూడిన శక్తివంతమైన మోటా రు 60 నుండి 100% ఎక్కువ శక్తిని అందిస్తుంది, ఇది వేగంగా ట్యాంక్ నింపడంలో సహాయపడు తుంది.

ప్రత్యేక హైడ్రాలిక్ డిజైన్ – హైబ్రిడ్ పంప్ (SS ఇన్సర్ట్‌తో) సక్షన్ ఏరియా, ఫ్లో ఏరియాతో సహా హైడ్రాలిక్ ప్రవాహ మార్గం యొక్క ప్రత్యేక డిజైన్ ఫలితంగా తక్కువ ఘర్షణ (నీటి ప్రవాహ నష్టం)తో స్థిరంగా అధిక నీటి విడుదలను అందించడంలో సహాయపడుతుంది.

వారంటీ – రెట్టింపు వారంటీ – 24 నెలలు ఉత్పత్తి ద్వారా అందించబడుతున్న పనితీరు నాణ్యతను నొక్కి చెబుతుంది

Latest article